నియోజకవర్గాల పునర్విభజన పై ఉమ్మడి మెదక్ జిల్లాలో పొలిటికల్ లీడర్ల కొత్త ఆశలు..
మెదక్, 29 మార్చి (హి.స.) డీలిమిటేషన్ తో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల స్థానాలు పెరగనున్నాయని రాజకీయ నేతలు సంబర పడుతున్నారు. కొన్ని ఏళ్లుగా అవకాశాలు రాక ఎదురుచూస్తున్న పార్టీల నాయకులు ఇప్పుడు పక్కా అవకాశం తమకేనని లెక్కలు వేసుకుంటున్నారు. కాగా
D limited


మెదక్, 29 మార్చి (హి.స.)

డీలిమిటేషన్ తో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల స్థానాలు పెరగనున్నాయని రాజకీయ నేతలు సంబర పడుతున్నారు. కొన్ని ఏళ్లుగా అవకాశాలు రాక ఎదురుచూస్తున్న పార్టీల నాయకులు ఇప్పుడు పక్కా అవకాశం తమకేనని లెక్కలు వేసుకుంటున్నారు.

కాగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రస్తుతం 11 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంట్ స్థానాలు ఉన్న విషయం తెలిసిందే. పునర్విభజన జరిగితే మరో ఐదు నుంచి ఆరు అసెంబ్లీ స్థానాలు, ఒకటి ఎంపీ స్థానం పెరగనున్నదని రాజకీయ పార్టీల నేతలు అంచనా వేసుకుంటున్నారు. అధికారికంగా లెక్కల తర్వాత ఏ మేరకు పెరగనున్నాయనేది స్పష్టత రానున్నప్పటికీ రాజకీయ పార్టీల్లో మాత్రం కొత్త ఉత్సాహం కనిపిస్తున్నది.

సంగారెడ్డి జిల్లాలో పటాన్చెరు, సంగారెడ్డి, జహీరాబాద్, అందోలు, నారాయణఖేడ్, మెదక్ జిల్లాలో మెదక్, నర్సాపూర్, సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలు మెదక్, సిద్దిపేట పార్లమెంట్ నియోజకవర్గాలున్నాయి. అయితే 2 లక్షల ఓటర్లకు ఓ అసెంబ్లీ స్థానాన్ని పెంచవచ్చునని కొందరు అంటుండగా పూర్తిగా జిల్లా, పార్లమెంట్ స్వరూపం ప్రకారం నియోజకవర్గాలు పెంపు ఉంటుందని అంటున్నారు.

డీలిమిటేషన్ తో ఉమ్మడి మెదక్ జిల్లాలో 5 నుంచి 6 అసెంబ్లీ స్థానాలు కొత్తగా ఏర్పడనున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 11 అసెంబ్లీ స్థానాలుండగా దానికి మరో 6 స్థానాలకు అదనంగా చేరే అవకాశాలు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గంలోనే 3 అసెంబ్లీ స్థానాలు పెరగనున్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలోని శేరిలింగంపల్లి పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఐదు ఆరు అసెంబ్లీ స్థానాలు కొత్తగా నుంచి పెరగవచ్చనంటున్నారు.

ఈ లెక్కన పటాన్చెరు పరిధిలో పటాన్ చెరు, అమీన్ పూర్, తెల్లాపూర్ పేర్లతో లేదా ఇతర పేర్లతోనైనా నియోజకవర్గాలు ఏర్పడవచ్చారు. అలాగే మెదక్ జిల్లాలోని గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో తూప్రాన్, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రామాయంపేటల్లో ఏదైనా ఒక అసెంబ్లీ స్థానం ఏర్పడనున్నది. అందోల్ నియోజకవర్గం నుంచి అల్లాదుర్గం పేరుతో మరో స్థానం ఏర్పడవచ్చు. ఇక పోతే సిద్దిపేట జిల్లాలో కొమురవెల్లి మరో అసెంబ్లీ నియోజకవర్గం అయ్యే అవకాశం ఉంటుందని అంచనాలు వేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande