వంటగ్యాస్ సిలిండర్ల సరఫరా బాయ్ 30 సిలిండర్లతో పరారీ
అమరావతి, 29 మార్చి (హి.స.) గాజువాక, వినియోగదారులకు సకాలంలో వంటగ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయకుండా 30 సిలిండర్లతో పరారైన గ్యాస్ డెలివరీ బాయ్పై గాజువాక పోలీసులకు శనివారం ఫిర్యాదు అందింది. సీఐ అళహరి పార్థసారథి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చినగంట్యాడలోన
వంటగ్యాస్ సిలిండర్ల సరఫరా బాయ్ 30 సిలిండర్లతో పరారీ


అమరావతి, 29 మార్చి (హి.స.)

గాజువాక, వినియోగదారులకు సకాలంలో వంటగ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయకుండా 30 సిలిండర్లతో పరారైన గ్యాస్ డెలివరీ బాయ్పై గాజువాక పోలీసులకు శనివారం ఫిర్యాదు అందింది. సీఐ అళహరి పార్థసారథి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చినగంట్యాడలోని మణికంఠ గ్యాస్ ఏజెన్సీలో రెండేళ్లుగా వై.అప్పారావు గ్యాస్ డెలివరీ బాయ్గా పని చేస్తున్నాడు.

తనకున్న పరిచయాల మీద కస్టమర్ల నుంచి ఓటీపీలు సంపాదించాడు. ఎంతకీ నిండు బండలు ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చిన వినియోగదారులు ఏజెన్సీకి వెళ్లి ఆరా తీయగా గ్యాస్ డెలివరీ చేసినట్లు నిర్వాహకులు చెప్పడంతో లబోదిబోమన్నారు. అప్పారావు కనిపించకపోవడం, సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండడంతో ఏజెన్సీ నిర్వాహకులు గాజువాక పోలీసులను ఆశ్రయించారు. 30 గ్యాస్ సిలిండర్లు, రూ.13వేల నగదు చెల్లించకుండా పరారైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వినియోగదారులకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గ్యాస్ పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు గాజువాక తహసీల్దార్ శ్రీనివాస్, సర్కిల్-3 ఏఎస్ఓ శ్రీహరి ఈ సందర్భంగా తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande