అమిత్ షాతో వెంకయ్యనాయుడు భేటీ.. అమరావతి బిల్లుపై చర్చ
ఢిల్లీ, 29 మార్చి (హి.స.) : కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై కీలకంగా చర్చించారు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా ప్రకటిస్తూ.. పునర్విభజన చట్ట
ex-vice-president-venkaiah-naidu-meets-amit-shah-and-discuss


ఢిల్లీ, 29 మార్చి (హి.స.)

: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై కీలకంగా చర్చించారు.

అమరావతిని ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా ప్రకటిస్తూ.. పునర్విభజన చట్టంలో సవరణ చేయాలని కోరుతూ ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపిన బిల్లును పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని అమిత్ షాను కోరారు. 2015 అక్టోబర్ 22న ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అప్పటి పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా ఉన్న తన చేతులమీదుగా అమరావతికి శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తుచేశారు.

అమరావతి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయం గురించి కూడా తెలిపారు. 2019లో రాష్ట్రంలో అధికారం మారిన తర్వాత నెలకొన్న పరిణామాలు, దానివల్ల ఎదురైన ఇబ్బందులను వివరించారు. భవిష్యత్తులో రాజధాని విషయంలో అలాంటి పరిస్థితులు ఎదురవ్వకుండా కేంద్రప్రభుత్వం పరంగా వెంటనే పార్లమెంట్ బిల్లు పెట్టి ఆమోదించాలని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande