రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ
అమరావతి, 29 మార్చి (హి.స.)రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాకినాడ జిల్లా కలెక్టరుగా ఉన్న షణ్మోహన్ ను ఏపీఈడీబీ సీఈఓగా బదిలీ చేసింది. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గా ఉన్న దినేష్ కుమార్
రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ


అమరావతి, 29 మార్చి (హి.స.)రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాకినాడ జిల్లా కలెక్టరుగా ఉన్న షణ్మోహన్ ను ఏపీఈడీబీ సీఈఓగా బదిలీ చేసింది. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గా ఉన్న దినేష్ కుమార్ ను APIIC MDగా బదిలీ చేసింది. గుంటూరు జిల్లా కలెక్టరుగా సాయికాంత్ వర్మను నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. విశాఖపట్నం జిల్లా కలెక్టరుగా అభిషిక్త్ కిశోర్, కాకినాడ జిల్లా కలెక్టరుగా హరేంద్ర ప్రసాద్, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టరుగా టి.నిశాంతి, పాఠశాల విద్యా డైరెక్టర్ గా తమిమిన్ అన్సారియాలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande