
ముంబై, 03 మార్చి (హి.స.)
బంగారం ధరలపై కొనుగోలుదారులకు ఊరట కలిగింది. మంగళవారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇరాన్-ఇజ్రాయెల్ వార్తో వరుసగా మూడు రోజులుధరలు పెరగ్గా.. ఇవాళ కాస్త తగ్గి శాంతించాయి. యుద్దంతో పసిడి ధరలు రూ.2 లక్షలకు చేరుకునే అవకాశం ఉందనే ప్రచారం సాగింది. కానీ బంగారం ధరలు కాస్త చల్లబడటంతో కొనుగోలు చేసేవారు ఊరట చెందుతున్నారు. అసలే పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ధరలు తగ్గడం కూడా శుభపరిణామంగా చెప్పవచ్చు. మంగళవారం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ నగరాల్లో గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
బంగారం ధరలు ఇవే..
-హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,70,500 వద్ద కొనసాగుతోండగా.. నిన్న రూ.1,70,510 వద్ద స్థిరపడింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు ఇప్పుడు రూ.1,56,290 వద్ద ట్రేడవుతుండగా.. నిన్న రూ.1,56,300 వద్ద స్థిరపడింది.
-విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,70,500 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,56,290 వద్ద ట్రేడవుతోంది.
-చెన్నైలో 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర రూ.1,70,830 ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,56,590 వద్ద ట్రేడవుతోంది.
-బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,70,500 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,56,290గా ఉంది.
-దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం రూ.1,70,650 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,56,440గా ఉంది.
వెండి రేట్లు ఇవే..
-ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 3,15,100గా ప్రస్తుతం కొనసాగుతోంది. సోమవారం దీని ధర రూ.3,15,000గా ఉంది.
-హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ.3,14,900గా ఉండగా.. నిన్న రూ.3,15,000 వద్ద స్థిరపడింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV