ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం..పెరిగిన క్రూడ్ ఆయిల్ ధర
హైదరాబాద్, 02 మార్చి (హి.స.) ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (Crude Oil) ధరలు అమాంతం పెరిగాయి. ఈ యుద్ధ మేఘాలు కమ్ముకున్న ఒక్కరోజులోనే చమురు ధరలు 10% పెరగడం గమనార్హం. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 10%
Crude oil


హైదరాబాద్, 02 మార్చి (హి.స.)

ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య ఘర్షణలు

తీవ్రరూపం దాల్చడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (Crude Oil) ధరలు అమాంతం పెరిగాయి. ఈ యుద్ధ మేఘాలు కమ్ముకున్న ఒక్కరోజులోనే చమురు ధరలు 10% పెరగడం గమనార్హం. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 10% పెరిగి, ఒక బ్యారెల్ 85 డాలర్ల నుండి 90 డాలర్ల స్థాయికి చేరుకుంది. ఈ అకస్మాత్తు పెరుగుదల ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై, ముఖ్యంగా భారతదేశం వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తోంది.

ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం సరఫరా నిలిచిపోతుందనే భయం. ప్రపంచ చమురు వాణిజ్యంలో అత్యంత కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్' మార్గం గుండా ప్రతిరోజూ సుమారు 21 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా అవుతుంది. ఒకవేళ ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేయడంతో ప్రపంచ సరఫరాలో దాదాపు 20% నిలిచిపోయింది ఈ ఆందోళనల వల్లే మార్కెట్లో వ్యాపారులు భారీగా కొనుగోళ్లు జరపడంతో ధరలు 10% మేర ఎగబాకాయి.

భారతదేశం తన చమురు అవసరాల్లో దాదాపు 85% దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో, ఈ 10% ధరల పెరుగుదల వల్ల దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలపై లీటరుకు రూ. 5 నుండి రూ.7 వరకు పెరిగే అవకాశం ఉంది. డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి, పండ్లు, కూరగాయలు మరియు నిత్యావసర వస్తువుల ధరలు కూడా సామాన్యుడికి భారంగా మారుతాయి. అంతేకాకుండా, చమురు దిగుమతుల కోసం భారత్ అదనంగా వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది, ఇది దేశ వాణిజ్య లోటును (Trade Deficit) పెంచి రూపాయి విలువను మరింత బలహీనపరుస్తుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande