మధ్యవర్తిగా పాకిస్తాన్.. 'మాకొద్దు' అని తిరస్కరించిన ఇరాన్: అంతర్జాతీయ వేదికపై మరోసారి గట్టి దెబ్బ!
ఢిల్లీ, 31 మార్చి (హి.స.) అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలను తగ్గించడానికి మధ్యవర్తిత్వం వహిస్తామన్న పాకిస్తాన్ ప్రతిపాదనను ఇరాన్ తోసిపుచ్చింది. తమ దేశానికి, అమెరికాకు మధ్య చర్చలు జరపడానికి పాకిస్తాన్ను వేదికగా మార్చాలన్న ఇస్లామాబాద్
irans-reaction-to-pakistans-mediation-536606


ఢిల్లీ, 31 మార్చి (హి.స.)

అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలను తగ్గించడానికి మధ్యవర్తిత్వం వహిస్తామన్న పాకిస్తాన్ ప్రతిపాదనను ఇరాన్ తోసిపుచ్చింది. తమ దేశానికి, అమెరికాకు మధ్య చర్చలు జరపడానికి పాకిస్తాన్ను వేదికగా మార్చాలన్న ఇస్లామాబాద్ అభ్యర్థనను టెహ్రాన్ వర్గాలు అధికారికంగా నిరాకరించాయి. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన చర్చల ప్రతిపాదనపై ఇరాన్ స్పందిస్తూ, తాము అమెరికాతో చర్చలు జరపడానికి ప్రస్తుతం సిద్ధంగా లేమని స్పష్టం చేసింది. ముఖ్యంగా పాకిస్తాన్ వంటి మూడవ పక్షం వేదికలపై తమకు నమ్మకం లేదని ఇరాన్ దౌత్య వర్గాలు పేర్కొన్నాయి. అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో తనదైన శైలిలో స్పందించారు. పాకిస్తాన్ వేదికలు లేదా ఫోరమ్లు వారి వ్యక్తిగతమని, అమెరికా తన విదేశీ విధానాలను సొంతంగా నిర్ణయించుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా ప్రయోజనాలకు భంగం కలిగించే ఏ చర్యలనైనా సహించబోమని ఆయన హెచ్చరించారు.

ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్, ఈ మధ్యవర్తిత్వం ద్వారా అంతర్జాతీయంగా తన పరపతిని పెంచుకోవాలని, తద్వారా అమెరికా నుండి ఆర్థిక ప్రయోజనాలు పొందాలని ఆశించింది. అయితే ఇరాన్ తిరస్కరణతో ఇస్లామాబాద్ ప్రయత్నాలకు గట్టి దెబ్బ తగిలింది. పశ్చిమ ఆసియాలో ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపులు, అమెరికా దళాల మధ్య దాడులు జరుగుతున్న నేపథ్యంలో, శాంతి చర్చల ఊసే లేదని ఇరాన్ పరోక్షంగా సూచించింది. పాకిస్తాన్ తన భౌగోళిక రాజకీయ ప్రాధాన్యతను చాటుకోవాలని చూసినప్పటికీ, ఇరాన్, అమెరికా మధ్య ఉన్న అగాధం ఇంకా తగ్గలేదని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతానికి ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరిగే అవకాశాలు కనిపించడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande