
జుబా, 30 మార్చి (హి.స.)
: దక్షిణ సూడాన్ మరోసారి రక్తసిక్తమైంది. రాజధాని జుబా శివార్లలోని ఓ బంగారు గని వద్ద తలెత్తిన వివాదంలో గుర్తుతెలియని సాయుధులు 70 మందికిపైగా ప్రజలను హతమార్చారని పోలీసులు తెలిపారు.
‘‘ ఓ బంగారు గనిపై గుర్తుతెలియని సాయుధులు దాడి చేశారు. ఈ ఘటనలో 70 మందికిపైగా మరణించారు. అనేక మంది గాయపడ్డారు’’ అని పోలీసులు తెలిపారు. దక్షిణ సూడాన్ ప్రతిపక్ష పార్టీ ‘సూడాన్ పీపుల్స్ లిబరేషన్ మూవ్మెంట్ ఇన్ అపోజిషన్’ (SPLM-IO).. ఈ దాడిని ఖండించింది. ప్రభుత్వ బలగాలే ఈ దుశ్చర్యకు పాల్పడ్డాయని ఆరోపించింది.
‘ఎస్పీఎల్ఎం-ఐవో’ పేరుతో కార్యకలాపాలు సాగిస్తున్న రియెక్ మచార్ మద్దతుదారులకు, దక్షిణ సూడాన్ అధ్యక్షుడు సల్వా కియిర్కు మధ్య అంతర్యుద్ధం సాగుతోంది. సెంట్రల్ ఈక్వటోరియా రాష్ట్రంలోని జెబెల్ ఇరాక్లో ఉన్న ఈ బంగారు గని ప్రాంతంలో గతంలోనూ అక్రమ గనుల తవ్వకందారులు, మైనింగ్ కంపెనీల మధ్య
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ