వేటపాలెం బాణాసంచా పేలుడు ఘటనలో 25 కు.చేరిన మృతుల సంఖ్య
కాకినాడ, 04 మార్చి (హి.స.) , :వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు ప్రమాద ఘటనలో మరొకరు మరణించారు. బుధవారం కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ వీర శ్రీను (39) కన్నుమూశారు. దీంతో ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 25కు చేరింది. మంగళవారం ఇదే ఆసుపత్ర
వేటపాలెం బాణాసంచా పేలుడు ఘటనలో 25 కు.చేరిన మృతుల సంఖ్య


కాకినాడ, 04 మార్చి (హి.స.)

, :వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు ప్రమాద ఘటనలో మరొకరు మరణించారు. బుధవారం కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ వీర శ్రీను (39) కన్నుమూశారు. దీంతో ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 25కు చేరింది. మంగళవారం ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లోవరాజు మరణించిన విషయం విదితమే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మిగిలిన ఐదుగురు క్షతగాత్రులకు వైద్య సేవలు కొనసాగుతున్నాయి. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande