చిత్తూరు.జిల్లాలో.రోడ్డు ప్రమాదం 5 గురి మృతి
చిత్తూరు, 04 మార్చి (హి.స.) జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గంగవరం మండలంలోని దండపల్లి క్రాస్ వద్ద బెంగళూరు-చెన్నై జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ముందువెళ్తున్న లారీని కారు ఢీకొట్టడంతో ఈ
చిత్తూరు.జిల్లాలో.రోడ్డు ప్రమాదం 5 గురి మృతి


చిత్తూరు, 04 మార్చి (హి.స.)

జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గంగవరం మండలంలోని దండపల్లి క్రాస్ వద్ద బెంగళూరు-చెన్నై జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ముందువెళ్తున్న లారీని కారు ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను మోహన్దాస్ (71), నాగరాజారావు (61), కుసుమ (61), జయంతి (59), పూజ (33)గా గుర్తించారు. వీరంతా బెంగళూరులోని రాజాజీనగర్ నుంచి తిరుమల దైవ దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గంగవరం సీఐ రామ్భూపాల్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande