ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గందరగోళ.పరిస్తితి
అమరావతి, 04 మార్చి (హి.స.) ఏపీ శాసనమండలిలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో చైర్మన్ మోషేన్ రాజు సభను రేపటికి(గురువారం) వాయిదా వేశారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతుండగా వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. చైర్మన్ పోడియం ఎక్కి నినాదాలు చేయడంతో స
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గందరగోళ.పరిస్తితి


అమరావతి, 04 మార్చి (హి.స.)

ఏపీ శాసనమండలిలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో చైర్మన్ మోషేన్ రాజు సభను రేపటికి(గురువారం) వాయిదా వేశారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతుండగా వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. చైర్మన్ పోడియం ఎక్కి నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది.

అంతకముందు.. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో మండలిలో రగడ చోటుచేసుకుంది. మాజీ సీఎం జగన్ను క్రిస్టియన్ అంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు ఆందోళకు దిగారు. దీంతో సభను ఒకసారి వాయిదా వేశారు చైర్మన్. తిరిగి మొదలైన తర్వాత కూడా.. జగన్కు క్షమాపణ చెప్పాలని వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ‘జగన్ను నేను క్రిస్టియన్ అని అన్నాను, ఆ మాటకు కట్టుబడి ఉన్నాను’ అని స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande