భద్రాద్రి రామయ్య పెండ్లి పనులు ప్రారంభం..
భద్రాచలం, 04 మార్చి (హి.స.) భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో రామయ్య పెండ్లి పనులు ఘనంగా ప్రారంభం అయ్యాయి. బుధవారం భద్రాద్రి రామయ్యకు హోలీ పౌర్ణమిని పురస్కరించుకుని డోలోత్సవం, వసంతోత్సవ వేడుకలు కన్నులపండువగా, సంప్రదాయబద్ధంగా సాగాయి. ఉ
Bhadradri


భద్రాచలం, 04 మార్చి (హి.స.)

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర

స్వామి ఆలయంలో రామయ్య పెండ్లి పనులు ఘనంగా ప్రారంభం అయ్యాయి. బుధవారం భద్రాద్రి రామయ్యకు హోలీ పౌర్ణమిని పురస్కరించుకుని డోలోత్సవం, వసంతోత్సవ వేడుకలు కన్నులపండువగా, సంప్రదాయబద్ధంగా సాగాయి. ఉదయం స్వామివారికి 25 కలశాలతో సహస్రధారతో ప్రత్యేక స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన స్వామివారిని ఉయ్యాల్లో ఆశీనులను చేసి డోలోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్థాన విద్వాంసులు రామదాసు, తూము నరసింహదాసు కీర్తనలను ఆలపిస్తుండగా నక్షత్ర, కుంభహారతిలను స్వామివారికి సమర్పించారు.

ముందుగా ప్రధాన ఆలయంలోని ధృవ మూర్తులకు, ఆంజనేయస్వామికి, లక్ష్మీతాయారు అమ్మవారికి వసంతాన్ని శాస్త్రోక్తంగా చల్లి భక్తులపై వసంతోత్సవ కార్యక్రమంకు చిహ్నంగా పసుపు నీళ్లను చల్లారు. దీన్నే వసంతోత్సవంగా పేర్కొంటారు. ముక్కోటి మండపంలో పసుపు కొట్టే కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. గులాము, పన్నీరు, అత్తరు, నెయ్యు లాంటి సుగంధ ద్రవ్యాలతో స్వామి వారి కళ్యాణ తలంబ్రాలు కలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, పొరుగు రాష్ట్రాల నుంచి వేలాదిమంది భక్తులు భద్రాద్రి చేరుకొని తమ స్వహాస్తాలతో తలంబ్రాలు కలిపి తన్మయత్వం చెందారు. చాలా మంది భక్తులు భక్తి భావంతో గోటితో వడ్లను వలిచి ఆ బియ్యాన్ని శిరస్సు పై ధరించి పాదయాత్రగా భద్రాచలం చేరుకొని, గిరిప్రదక్షణ నిర్వహించి తలంబ్రాలు కలిపారు. కాగా హోలీ పూర్ణిమ నాడే రామయ్యని పెండ్లి కుమారున్ని చేస్తారని అనాదిగా భావిస్తుంటారు. భద్రాద్రిలో ఈనెల 19 నుంచి వసంత పక్ష ప్రయుక్త తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. దీనిలో భాగంగా 27వ తేదీన సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande