నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం లోని. కృష్ణాపురం గ్రామంలో పుట్టాలమ్మ ఆలయంలో బ్రహ్మోత్సవాలు
ఆళ్లగడ్డ, 04 మార్చి (హి.స.) నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని కృష్ణాపురం గ్రామంలోని రామతీర్థం పుట్టాలమ్మ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో ఏ
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం లోని. కృష్ణాపురం గ్రామంలో పుట్టాలమ్మ ఆలయంలో బ్రహ్మోత్సవాలు


ఆళ్లగడ్డ, 04 మార్చి (హి.స.)

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని కృష్ణాపురం గ్రామంలోని రామతీర్థం పుట్టాలమ్మ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో ఏర్పాటుచేసిన కల్యాణ వేదికపై శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పట్టు వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించి కొలువు తీర్చారు. భక్తుల సమక్షంలో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా కల్యాణం జరిపారు. ఈ అపూర్వ ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం నరసింహస్వామి ఆలయ ఆవరణలో దీక్ష హోమం నిర్వహించి పూర్ణాహుతి చేశారు. ఆలయ ఈవో సాయి జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande