ఈ నిర్ణయంతో అనేక మార్పులు వచ్చాయి: సీఎం చంద్రబాబు
కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన, మౌలిక సదుపాయాలు కల్పన ఊపందుకుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
Chandrababu Naidu


హైదరాబాద్, 04 మార్చి (హి.స.)కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన, మౌలిక సదుపాయాలు కల్పన ఊపందుకుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఆయా అంశాలపై బుధవారం అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా చర్చించారు. సీఎం చంద్రబాబు ఏమన్నారంటే.. విద్యాశాఖలో ఐటీని వినియోగించుకున్న అనంతరం ఏఐను సైతం వినియోగించుకుంటున్నారు.

మధ్య తరగతి, పేద వారికి యూనివర్సియల్ హెల్త్ కవరేజి తేవడంతో పాటు ప్రతి ఒక్కరికి రూ. 2. 50 లక్షల ఇన్సురెన్స్ ఎన్డీఏ ప్రభుత్వం చేసింది. పేద వారికి వైద్యం కోసం ప్రతీ ఒక్కరికి రూ. 20 లక్షల వరకూ ఖర్చు చేయడానికి సిద్ధం. పీపీపీ కింద కాలేజీల నిర్మాణం చేస్తున్నాం. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రిలు ఏర్పాటు చేస్తాం.

పీపీపీ అంటే ప్రైవేట్ కాదు.. పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ షిప్ మాత్రమే. మాతృభాషలోనే ప్రాధమిక విద్య ఉండాలి.. అందుకే దానిని మనం ప్రోత్సహిస్తాం. గత పాలనలో చాలా పరిశ్రమలు రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోయాయి.. బ్రాండ్ పోతే చాలా కష్టం. ఆర్బీఐ ఇటీవల ఒక పబ్లికేషన్ ఇచ్చారు. అయితే దీని ప్రకారం మన రాష్ట్రంలో చిన్న పరిశ్రమలు తగ్గిపోయాయి.

గత ప్రభుత్వం గంజాయిని ప్రోత్సహించింది.. ఒక్క డీఎస్సీ, ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగాలను కూడా కల్పించలేదు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మాట ఇచ్చాం.. దాన్ని నిలబెట్టుకుంటాం. మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలోని ఉద్యోగాలు కల్పించే కమిటీ చాలా బాగా పనిచేస్తోంది. టూరిజానికి పరిశ్రమల స్థాయి కల్పించాం. నియోజకవర్గానికి ఒక పారిశ్రామిక పార్క్ పెడుతున్నాం. ఎంఎస్ఎంఈలలో సుమారు 2.40 లక్షల వరకూ ఉద్యోగాలు వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగాలు 30,500కు పైగా ఉద్యోగాలు ఇచ్చాం. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,28,327 మందికి ఉద్యోగాలు ఇచ్చాం.

20 నెలల్లో టీడీపీ, జనసేన, బీజేపీలు ఒకే మాటగా నిలబడ్డాం. ఒక రూపాయికి విశాఖలో భూమి కేటాయించాలన్నప్పడు నేను ఆలోచించా. అయితే మొదట టీసీఎస్కు ఇచ్చాం. ఈ నిర్ణయంతో అనేక మార్పులు వచ్చాయి. గత 20 నెలల్లో అనేక కంపెనీలు విశాఖకు క్యూ కట్టాయి. ఆర్సెలర్ మిట్టల్ 69 వేల కోట్ల ఫేజ్ వన్ను ప్రారంభిస్తారు. అందుకు మార్చి 26న భూమి పూజ చేస్తాం. ఏప్రిల్ నెలలో విశాఖలో గూగుల్కు భూమి పూజ చేస్తాం. ఇకపై ఎవ్వరూ ప్రభుత్వం వద్దకు వచ్చే అవసరం లేకుండా వారికి ఇవ్వాల్సిన మొత్తాన్ని ఆన్లైన్లోనే అందిస్తాం. అతిథి దేవోభవ మన విధానం.... టూరిజం మా ప్రయారిటీ.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande