రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో సస్పెన్స్.. మహేశ్ కుమార్ గౌడ్ ఢిల్లీ టూర్ వాయిదా
హైదరాబాద్, 04 మార్చి (హి.స.) తెలంగాణలో రాజ్యసభ అభ్యర్థులపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. అభ్యర్థుల ఎంపిక కోసం ఢిల్లీ వెళ్లాల్సిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పర్యటన వాయిదా పడింది. తెలంగాణలో 2 రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక కోసం అధిష్టానంతో చర్చించేందుక
Congress


హైదరాబాద్, 04 మార్చి (హి.స.)

తెలంగాణలో రాజ్యసభ అభ్యర్థులపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. అభ్యర్థుల ఎంపిక కోసం ఢిల్లీ వెళ్లాల్సిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పర్యటన వాయిదా పడింది. తెలంగాణలో 2 రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక కోసం అధిష్టానంతో చర్చించేందుకు ఈ రోజు మధ్యాహ్నం ఆయన ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. కానీ ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ లేకపోకపోవడంతో మహేశ్ కుమార్ గౌడ్ ఢిల్లీ టూర్ క్యాన్సిల్ అయింది. దీంతో ఇవాళ మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో అధిష్టానం పెద్దలు ఫోన్లోనే చర్చించనున్నారు.

ఆ ఒక్కరు ఎవరో?:

రాష్ట్రంలో రెండు రాజ్యసభ స్థానాలకు జరగబోతున్న ఎన్నికల్లో ఒక సీటు ఎవరికో ఖరారైనా మిగిలిన సీటు కోసం అభ్యర్థి ఎవరో అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అధిష్టానం కోటాలో అభిషేక్ సింఘ్వీకే మరో చాన్స్ దక్కిందనే ప్రచారం జరుగుతోంది. దీంతో మరో స్థానంలో అవకాశం కోసం అరడజన్కు పైనే ఆశావహులు రేస్ లో ఉన్నారు. జీవితాంతం పార్టీ కోసమే పని చేశాం ఈ ఒక్కసారికి ఆ చాన్స్ తమకే ఇవ్వండి ప్లీజ్ అంటూ సీనియర్లు, పార్టీకి తాము చేస్తున్న సేవలను గుర్తించాలంటూ మరికొంత మంది నేతలు ఎవరికి వారు అధిష్టానం పెద్దల వద్ద అవకాశం కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు రేపటితో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుండటంతో అధిష్టానం మనసులో ఎవరు ఉన్నారు? రాష్ట్రం నుంచి చాన్స్ కొట్టేయబోతున్న ఆ లక్కీ పర్సన్ ఎవరూ అనేది ఉత్కంఠ రేపుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande