
హైదరాబాద్, 04 మార్చి (హి.స.)
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆదిలాబాద్ జైలు నుంచి బుధవారం బెయిల్పై విడుదలయ్యారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నిక సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ సహా బీఆర్ఎస్ నాయకులపై పెట్టిన అక్రమ కేసులో జిల్లా సెషన్స్ కోర్టు సోమవారం బెయిల్ మంజూరుచేయడంతో ఆయన బయటకొచ్చారు.
చెన్నూర్ కోర్టులో ఉన్న మరో కేసులో పీటీ వారెంట్ పిటిషన్పై విచారణను ఆ కోర్టు ఈ నెల 5కు వాయిదా వేసింది. బాల్కసుమన్కు ఈ కేసులో నూ బెయిల్ రావాల్సి ఉండటంతో, ఐదో తేదీ తర్వాతే ఆయన జైలు నుంచి బయటికి వస్తారని అంతా భావించారు. కానీ మంగళవారం చెన్నూర్ కోర్టులో పీటీ వారెంట్ పిటిషన్పై విచారణ జరపాలని బాల్కసుమన్ తరఫు న్యాయవాదులు మరో పిటిషన్ వేయడంతో మంగళవారం కోర్టు విచారణను స్వీకరించింది. బాల్క సుమన్ తరుఫు న్యాయవాదుల వాదనల అనంతరం బెయిల్ మంజూరుచేసింది. దీంతో బుధవారం బాల్కసుమన్ సహా ఈ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ నాయకులు జైలు నుంచి బయటికి వచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..