
చిత్తూరు, 04 మార్చి (హి.స.)
,చిత్తూరు గ్రామీణ మండలం తుమ్మిందపాలెంలో దారుణం జరిగింది. ఇద్దరి వ్యక్తులు మధ్య నగదు విషయంలో వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో సాయికుమార్ అనే వ్యక్తిని ఢిల్లీ బాబు నాటు తుపాకీతో కాల్చి హత్య చేశాడు. అనంతరం అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు వెంటనే స్పందించి.. తాలుకా పోలీసులకు సమాచారం అందించారు.
X
పోలీసులు తుమ్మిందపాలెం గ్రామానికి చేరుకుని.. సాయికుమార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చిత్తూరు జిల్లా ప్రభుత్వాసుపత్రికి పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ఢిల్లీ బాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతుడు సాయికుమార్ కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇవ్వడంతో.. ప్రభుత్వాసుపత్రి వద్దకు వారు చేరుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ