ఆ విషయంలో నా కుమార్తె సుస్మిత ఎవర్నీ వదలిపెట్టదు: కొండా మురళీ
మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ మంత్రి కొండా సురేఖ భర్త మురళీ కీలక వ్యాఖ్యలు చేశారు. పరకాల తమ అడ్డా... వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచే కొండా సురేఖ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు
Politician


హైదరాబాద్, 04 మార్చి (హి.స.)మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ మంత్రి కొండా సురేఖ భర్త మురలీ కీలక వ్యాఖ్యలు చేశారు. పరకాల తమ అడ్డా... వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచే కొండా సురేఖ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఇవాళ(బుధవారం) గీసుగొండ మండలంలోని కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతరలో కొండా మురళీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తన బిడ్డా కొండా సుస్మిత ఎవరినైనా ఎదిరిస్తుందని చెప్పుకొచ్చారు. తనకన్నా కొండా సుస్మిత ధైర్యవంతురాలని తెలిపారు. కార్యకర్తలకు సమస్య వస్తే ఎవర్నీ వదలిపెట్టదని అన్నారు. ఎంతటివారినైనా ధైర్యంగా ఎదుర్కొంటుందని కొండా మురళీ పేర్కొన్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande