వైసీపీ ఆరోపణలపై మంత్రి లోకేశ్ ధీటుగా సమాధానం
ఏపీ శాసనమండలిలో తిరుమల లడ్డూ కల్తీపై చర్చ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ వైసీపీ సభ్యుల ఆరోపణలపై ధీటుగా సమాధానం ఇచ్చారు.
AP


హైదరాబాద్, 04 మార్చి (హి.స.)ఏపీ శాసనమండలిలో తిరుమల లడ్డూ కల్తీపై చర్చ సందర్భంగా వైసీపీ సభ్యులపై మంత్రి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. వైసీపీ సభ్యులు చేసిన ఆరోపణలపై మంత్రి ధీటుగా సమాధానం ఇచ్చారు. ‘గత పది సంవత్సరాలుగా మేము ప్రతి ఏటా మార్చి 21న మా బాబు పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో అన్నదానం చేస్తాం. వైసీపీ సభ్యులు లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అనే ప్రశ్న తప్ప మిగిలిన అన్నీ మాట్లాడుతున్నారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. కల్తీ జరిగిందని సిట్ రిపోర్టులో స్పష్టంగా ఉందని.. వైవీ సుబ్బారెడ్డి కూడా దాన్ని ఒప్పుకున్నారని ఆయన తెలిపారు.

మార్కెట్లో నెయ్యి రేటు పెరిగింది.. మీరు చేసినట్లే 300 రూపాయలకు కొనుగోలు చేసి.. నెయ్యిని కల్తీ చేసి సప్లై చేయమంటారా’ అని మంత్రి ప్రశ్నించారు. కల్తీ జరగలేదని చెప్పేందుకు వైసీపీ సభ్యులు సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు. తమ కుటుంబానికి దేవుడిపై అపారమైన గౌరవం ఉందని తెలిపారు. దేవుడిపై నమ్మకం ఉందని డిక్లరేషన్పై జగన్ కనీసం సంతకం కూడా పెట్టలేదని విమర్శించారు. ‘అసలు కల్తీ జరగలేదని చెబుతారా? దేవుడు మిమ్మల్ని వదలి పెట్టడు’ అంటూ మంత్రి లోకేశ్ హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande