
హైదరాబాద్, 04 మార్చి (హి.స.)
తెలుగు రాష్ట్రాల్లో అరుదైన, అత్యంత
సహాయంతో ఖరీదైన వ్యాధుల బారిన పడుతున్న పసిపిల్లల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. మొన్న చిన్నారి పునర్విక 'స్పైనల్ మస్కులర్ అట్రోఫీ' (SMA) తో పోరాడి, దాతల ప్రాణాలు నిలుపుకున్న వార్త మరువకముందే.. నేడు కర్నూలుకు చెందినా అశ్వత్ అనే మరో చిన్నారి డ్యూన్ మస్క్యులార్ డెస్ట్రోపీ(DMD) ప్రాణాంతక సమస్యతో మృత్యువుతో పోరాడుతున్నాడు. ఈ వ్యాధి సోకిన పిల్లల్లో కండరాలు క్రమంగా బలహీనపడి, వారు కదలలేకపోవడమే కాకుండా, చివరికి శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారుతుంది. ఈ వ్యాధికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 'జోల్గెన్స్మా' (Zolgensma) అనే ఇంజెక్షన్ ఒక్కటే ఏకైక పరిష్కారం. అయితే దీని ధర అక్షరాలా రూ. 26 కోట్లు. అమెరికా నుండి దిగుమతి చేసుకోవాల్సిన ఈ మందు కోసం కోట్లాది రూపాయలు సమకూర్చుకోవడం ఆ మధ్యతరగతి కుటుంబానికి తలకు మించిన భారమే కాదు, ఊహకు కూడా అందని అసాధ్యమైన పనిగా మారింది. రెండేళ్ల లోపు ఈ ఇంజెక్షన్ ఇస్తేనే ప్రాణాలు నిలుస్తాయని వైద్యులు హెచ్చరిస్తుండటంతో, అశ్వత్ తల్లిదండ్రులు ప్రతి నిమిషం మృత్యువుతో పరుగు పందెం చేస్తున్నారు.
ఈ భారీ మొత్తాన్ని సేకరించడం కోసం సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే పెద్ద ఎత్తున 'క్రౌడ్ ఫండింగ్' ప్రచారాలు మొదలయ్యాయి. గతంలో పునర్విక, ఇతర పిల్లల విషయంలో సెలబ్రిటీలు, ప్రవాస భారతీయులు, సామాన్య ప్రజలు స్పందించిన తీరును గుర్తుచేసుకుంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. అశ్వత్ తండ్రి మా బిడ్డను కాపాడుకోవడానికి మా దగ్గర ఉన్న ఆస్తులన్నీ అమ్మినా కనీసం ఒక శాతం ఖర్చు కూడా రాదు, కేవలం మీ అందరి దాతృత్వమే మా అబ్బాయిని బతికించగలదు
అంటూ ఆయన చేస్తున్న అభ్యర్థనలు నెటిజన్ల మనసులను కలచివేస్తున్నాయి. ప్రభుత్వం ఇటువంటి అరుదైన వ్యాధుల విషయంలో స్పందించి, మందులపై దిగుమతి సుంకాలు, పన్ను మినహాయింపులు ఇవ్వడమే కాకుండా, బాధితులకు తక్షణ ఆర్థిక సాయం అందించేలా ఒక శాశ్వత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. అశ్వత్ ప్రాణం ఇప్పుడు దాతల ఉదారతపై ప్రభుత్వం చూపే చొరవపై మాత్రమే ఆధారపడి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..