
హైదరాబాద్, 04 మార్చి (హి.స.)
మద్యప్రాచ్యంలో పెరుగుతున్న
ఉద్రిక్తతలపై అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) స్పందించింది. ప్రపంచ ఆర్థికవ్యవస్థపై ఈ యుద్ధ ప్రభావం ఎంత మేర ఉంటుందనే దానిపై ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రాంతంలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. పరిణామాలను ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షిస్తున్నాం. అయితే, ఇప్పటికిప్పుడు ఈ యుద్ధం వల్ల పశ్చిమాసియాతో పాటు ప్రపంచ ఆర్థికవ్యవస్థపై కలిగే ఆర్థిక నష్టాలను అంచనా వేయలేమని, అలా చేస్తే తొందరపాటు అవుతుందని అభిప్రాయపడింది. వాణిజ్యం, ఆర్థిక కార్యకలాపాలకు అంతరాయాలు, ఇంధన ధరల పెరుగుదల, ఆర్థిక మార్కెట్లలో అస్థిరతలను గమనించాం. పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో ఇప్పటికే అనిశ్చితిలో ఉన్న ప్రపంచ ఆర్థికవ్యవస్థపై మరింత ఒత్తిడి ఉంటుందని, యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందనే దాన్ని బట్టి నష్టం ఉంటుందని తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..