ఫ్యాక్షన్ రాజకీయాలను జగన్ పెంచి పోషించారు: మంత్రి లోకేశ్
అమరావతి, 04 మార్చి (హి.స.)ఫ్యాక్షన్ రాజకీయాలను గతంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి, ఆ తర్వాత జగన్ పెంచి పోషించి వందల మంది తెదేపా కార్యకర్తల హత్యలకు కారకులయ్యారని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో దారుణహత్యకు గురైన తెదేపా నేత త
Lokesh


అమరావతి, 04 మార్చి (హి.స.)ఫ్యాక్షన్ రాజకీయాలను గతంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి, ఆ తర్వాత జగన్ పెంచి పోషించి వందల మంది తెదేపా కార్యకర్తల హత్యలకు కారకులయ్యారని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో దారుణహత్యకు గురైన తెదేపా నేత తోట చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇచ్చేందుకు వీలుగా ఏపీ పబ్లిక్ సర్వీసు నియామకాల సవరణ బిల్లును శాసనసభలో మంత్రి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడారు. 2025 సెప్టెంబర్ 27న శాసనసభలో బిల్లును ఆమోదించి మండలికి పంపించామని.. అక్కడ బిల్లును చర్చకు తీసుకోలేదన్నారు. వంద రోజులు దాటడంతో మళ్లీ బిల్లును శాసనసభలో పెట్టాల్సి వచ్చిందని వివరించారు.

బీసీ వర్గానికి చెందిన తోట చంద్రయ్యను 2022 జనవరి 12న హత్య చేశారని, నమ్ముకున్న సిద్ధాంతం కోసం నిలబడి ప్రజల కోసం ఆయన పోరాడారన్నారు. నడిరోడ్డుపై చంద్రయ్యను గొంతు కోసి చంపారని.. దేశమంతా ఇది చూసిందని చెప్పారు. ఆయన కుమారుడికి ఉద్యోగం ఇచ్చేందుకు కూటమి పార్టీలు సమ్మతించాయని.. అందుకే బిల్లు పెట్టినట్లు సభకు వివరించారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande