
అమరావతి, 04 మార్చి (హి.స.)
గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలకు తేడా లేకుండా పోయిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల్లో గత ప్రభుత్వం పెట్టిన విధానాలపై విమర్శలు చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కూడా సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల విధానాలను తీసుకొచ్చారని ఆరోపించారు. 50 శాతం కన్వీనర్, 30 శాతం మేనేజ్మెంట్, 15 శాతం ఎన్ఆర్ఐ కోటాను తీసుకువచ్చి ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు తేడా లేకుండా చేసిందన్నారు. జగన్ హయాంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అక్రమాలు జరిగాయన్నారు. వచ్చే రెండేళ్లలో పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణాలు పూర్తి చేస్తామని తెలిపారు. అలాగే కూటమి హయాంలో ప్రతీ మెడికల్ కాలేజీలో అదనంగా 11 మెడికల్ సీట్లను ఇస్తామన్నారు. అలాగే ప్రజలకు అందుబాటులోకి ఉచితంగా 70 శాతం ఓపీ సేవలను కూడా తీసుకువస్తున్నట్లు చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV