మండలి ఛైర్మన్పై అవిశ్వాసం పెట్టే యోచనలో వైకాపా ఎమ్మెల్సీలు
అమరావతి, 04 మార్చి (హి.స.) వైకాపాకు రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు శాసనమండలి ఛైర్మన్ మోషేనురాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో ఉన్నారు. ఐదుగురు సభ్యులు రాజీనామా చేసినా ఇంతవరకూ మండలి ఛైర్మన్ ఆమోదించలేదు. ఛైర్మన్ తీరుకు నిరసనగా ఆయనపై అవిశ్వాసం పెట్టాలని ఆ ఎమ్
మండలి ఛైర్మన్పై అవిశ్వాసం పెట్టే యోచనలో వైకాపా ఎమ్మెల్సీలు


అమరావతి, 04 మార్చి (హి.స.) వైకాపాకు రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు శాసనమండలి ఛైర్మన్ మోషేనురాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో ఉన్నారు. ఐదుగురు సభ్యులు రాజీనామా చేసినా ఇంతవరకూ మండలి ఛైర్మన్ ఆమోదించలేదు. ఛైర్మన్ తీరుకు నిరసనగా ఆయనపై అవిశ్వాసం పెట్టాలని ఆ ఎమ్మెల్సీలు భావిస్తున్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సరిపడా సంఖ్యాబలం ఉండటంతో ఈ నిర్ణయం దిశగా ఆలోచిస్తున్నారు. వైకాపా నుంచి ఎమ్మెల్సీలుగా గెలిచిన పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణ తదితరులు అవిశ్వాసం పెట్టే యోచనలో ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande