మన వంట గదిలోకి ‘ఇరాన్ మంట
అమరావతి, 04 మార్చి (హి.స.)పప్పుదినుసులు దేశీయంగా పండుతుండగా, విదేశాల నుంచీ దిగుమతి చేసుకుంటున్నాం. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో.. నౌకా సరకు రవాణాకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో అంతర్జాతీయంగా పప్పు ధాన్యాల ధరలు పెరిగే అవకాశం ఉందని
మన వంట గదిలోకి ‘ఇరాన్ మంట


అమరావతి, 04 మార్చి (హి.స.)పప్పుదినుసులు దేశీయంగా పండుతుండగా, విదేశాల నుంచీ దిగుమతి చేసుకుంటున్నాం. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో.. నౌకా సరకు రవాణాకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో అంతర్జాతీయంగా పప్పు ధాన్యాల ధరలు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఒక వేళ యుద్ధం వారం మించి కొనసాగితే, నౌకల రవాణా స్తంభించి, పప్పు ధాన్యాల ధరలు పెరగక తప్పదని అఖిల భారత పప్పు మిల్లు సంఘం ప్రెసిడెంట్ సురేశ్ అగర్వాల్ చెబుతున్నారు.

5-6 మి.టన్నుల పప్పు ధాన్యాల దిగుమతి

మనదేశం ఏటా 5-6 మిలియన్ టన్నుల మేర కంది పప్పు, పెసరపప్పు వంటి పప్పు ధాన్యాలను మయన్మార్, కెనడా, ఆఫ్రికా నుంచి దిగుమతి చేసుకుంటోంది. అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల వీటి రవాణా దీర్ఘకాలం ఆగినా, రవాణా వ్యయాలు పెరిగినా.. ఆ భారం పప్పుల ధరల రూపేణ మన కుటుంబాలపై పడుతుంది. యుద్ధం నేపథ్యంలో రవాణా-బీమా ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. ఈ భారం అంతా కొనుగోలుదార్లకు బదిలీ అవుతుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande