
అమరావతి, 05 మార్చి (హి.స.)
అమరావతి,: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి శుక్రవారానికి వాయిదా పడింది. గురువారం మండలి ప్రారంభమైన తర్వాత.. తిరుమల శ్రీవారి కల్తీ నెయ్యిపై లఘు చర్చ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి వివరణ ఇస్తుండగా.. ఆయన ప్రసంగానికి వైసీపీ సభ్యులు అడ్డు తగిలారు. బుధవారం శాసన మండలి చైర్మన్ మోజేస్ రాజుపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టుల పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. అందుకు చైర్మన్ స్పందిస్తూ.. చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ