ఉమ్మడి పశ్చిమ జిల్లా లో.భానుడి భగ భగ లతో అల్లాడి పోతున్నారు
ఏలూరు, 05 మార్చి (హి.స.) ఉమ్మడి పశ్చిమ జిల్లాలో భానుడి భగభగలతో)ప్రజలు అల్లాడిపోతున్నారు. మార్చి మొదటి వారంలోనే ఏలూరు నగరంలో 39 డిగ్రీల సెంటీగ్రేడ్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం తొమ్మిది గంటల నుంచే ఎండల తీవ్రత పెరగడంతో మధ్యాహ్న సమయంలో రోడ్లన్నీ
ఉమ్మడి  పశ్చిమ జిల్లా లో.భానుడి భగ భగ లతో అల్లాడి పోతున్నారు


ఏలూరు, 05 మార్చి (హి.స.)

ఉమ్మడి పశ్చిమ జిల్లాలో భానుడి భగభగలతో)ప్రజలు అల్లాడిపోతున్నారు. మార్చి మొదటి వారంలోనే ఏలూరు నగరంలో 39 డిగ్రీల సెంటీగ్రేడ్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం తొమ్మిది గంటల నుంచే ఎండల తీవ్రత పెరగడంతో మధ్యాహ్న సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. విపరీతమైన ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా మార్చి ఆరంభంలోనే ఉషోగ్రతల తీవ్రత పెరిగింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూర్యుడి ప్రభావం విపరీతంగా ఉంది. గతంలో ఏప్రిల్లో ఈ ఎండల తీవ్రత కనిపించేది. కాని పిబ్రవరి నెలాఖరు నుంచే ఎండల తీవ్రత 37 డిగ్రీలకు చేరింది. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని సమాచారం.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande