
అమరావతి, 05 మార్చి (హి.స.)
,రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అస్వస్థతకు గురయ్యారు. గురువారం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఆమె కొంత అస్వస్థతకు గురయ్యారు. దీంతో అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న వైద్యులు.. అనితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు బీపీ అధికంగా ఉందని గుర్తించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం విజయవాడలోని ఆసుపత్రికి మంత్రి అనిత వెళ్లారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ