
నరసన్నపేట, 05 మార్చి (హి.స.)
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల్లోని పాఠశాలల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు దేశంలోని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రాలను సందర్శించే అరుదైన అవకాశాన్ని ఇస్రో(ISRO YUVIKA)కల్పిస్తోంది. అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు యువిక-2026 పేరిట ఆహ్వానం పలుకుతోంది. ఎంపికైన విద్యార్థులకు స్నేస్ టెక్నాలజీ, సైన్స్ అప్లికేషన్స్పై ప్రాథమిక జ్ఞానాన్ని అందించి... స్ఫూర్తి నింపే ఉద్దేశంతో ఇస్రో ఈ యువ విజ్ఞాన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ