
అమరావతి, 05 మార్చి (హి.స.)
అమరావతి, మార్చి 5: ఏపీలోని నగరాలు, పట్టణాల్లో జనాభా ప్రస్తుతం 36 శాతం ఉండగా, 2047 నాటికి 60 శాతానికి చేరుతుందని మంత్రి నారాయణ తెలిపారు. దీనికి తగినట్లుగా సదుపాయాలు కల్పించడంపై దృష్టి సారించామని చెప్పారు. గురువారం ఏపీ శాసనసభలో పురపాలకశాఖ బడ్జెట్ రూ.14,538కోట్ల బడ్జెట్ గ్రాంట్ల కోసం అసెంబ్లీలో మంత్రి నారాయణ ప్రతిపాదించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చెత్త సేకరణ, నిర్వహణ, నీటి పునర్వినియోగం, ప్రతి ఒక్కరికీ ఇళ్లు, రోడ్లు, ఆసుపత్రులు, శ్మశానాలు వంటి అంశాలపై దృష్టి సారించామని మంత్రి వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ