
అమరావతి, 05 మార్చి (హి.స.):ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 14వ రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ(గురువారం) శాసన సభలో అంగన్వాడీల అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా పాక్షికంగా పూర్తయిన అంగన్వాడీ భవనాల అంశంపై పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు ప్రశ్నించారు. ఈ విషయంపై తెలుగుదేశం రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడారు. అంగన్వాడీల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలని తాము వెళ్లినప్పుడు ఆయా కేంద్రాల్లో ఐదుగురు మాత్రమే ఉంటున్నారని చెప్పుకొచ్చారు. ఇది భారీ కార్యక్రమమని.. చాలా మందికి ఉపాధి కల్పించిందని తెలిపారు. కడియం మండలంలో స్థానిక సంస్థల నిధులతో అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీరు ఏర్పాటు చేశారని గోరంట్ల బుచ్చయ్య ప్రస్తావించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ