
భూపాలపల్లి, 05 మార్చి (హి.స.) భూపాలపల్లి అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగుతున్నాయి. గత మూడు రోజులుగా భూపాలపల్లి జిల్లాలోని కాటారం ఆజాద్ నగర్ రేంజ్ పరిధిలో మంటలు చెలరేగి విలువైన అటవీ సంపద కాళీ బూడిదై పోతుంది. కొంతమంది ఆకతాయిలు అడవికి నిప్పు పెట్టడంతో అది అడవిలో విస్తరించి పోయింది. దీంతో అడవిలో ఎండిపోయిన కలపతో పాటు అడవిలో అటవీ శాఖ అధికారులు పెంచుతున్న మొక్కలు సైతం మంటలకు కాలిపోతున్నాయి. ప్రతి సంవత్సరం వేసవి కాలం ఆరంభంలో ఈ తతంగం జరుగుతున్నప్పటికీ అటవీ విశాఖ సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. వేసవికాలంలో చెట్లు ఆకు రాల్చడంతో అవి ఎండిపోయి చిన్న నిప్పురవ్వ అంటుకున్న విస్తారంగా మంటలు చెలరేగిపోతున్నాయి. ప్రభుత్వం ప్రతి ఏటా వర్షాకాల వనమహోత్సవం పేరిట లక్షలాది చెట్లు నాటుతున్న ప్పటికీ ఇలాంటి మంటలు చెలరేగుతున్న సమయంలో ఆ మొక్కలన్నీ అగ్నికి ఆహుతి కావడంతో ప్రభుత్వం పెట్టిన నిధులన్నీ బుగ్గి పాలవుతున్నాయి. అటవీశాఖ ముందస్తు చర్యలు తీసుకొని అడవుల్లో మంటలు వేయకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.
అడవికి అంటుకున్న మంటలో విలువైన కలప తో పాటు అడవుల్లో ఉన్న అడవి జంతువులకు సైతం ప్రాణహాని జరుగుతుంది. అడవుల్లో ఉన్నా చిన్న చిన్న జంతువులు మంటలు చుట్టుముట్టగానే ఎటు వెళ్లలేని పరిస్థితులు ఏర్పడడంతో అవి అగ్ని ఆహుతి కి ఆవుతున్నాయి. చెట్టుపై ఉన్న పక్షులు సైతం మంటల వేడికి అందులో ఉన్న పక్షులు వాటి పిల్లలు చనిపోయే ప్రమాదం ఉంది. అటవీలోని సంపదను రక్షించాల్సిన అటవీ శాఖ అధికారులు సంబంధిత చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు