ఇరాన్ పై.అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న.యుద్ధం తీవ్ర ప్రభావం
అమరావతి, 05 మార్చి (హి.స.) ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రస్తుతానికి ధరలు పెరగనప్పటికీ యుద్ధం ఇదేవిధంగా కొనసాగితే నిత్యావసర ధరలు భగ్గుమనే చాన్స్ లేకపోలేదు. ఇప్పటికే ఇరాన్ జలరవాణాలో కీలకమైన హ
ఇరాన్ పై.అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న.యుద్ధం  తీవ్ర ప్రభావం


అమరావతి, 05 మార్చి (హి.స.)

ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రస్తుతానికి ధరలు పెరగనప్పటికీ యుద్ధం ఇదేవిధంగా కొనసాగితే నిత్యావసర ధరలు భగ్గుమనే చాన్స్ లేకపోలేదు. ఇప్పటికే ఇరాన్ జలరవాణాలో కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసివేయడంతో వాణిజ్య నౌక రాకపోకలు ఆగిపోయాయి. నిత్యావసర వస్తువులతోపాటు ఆయిల్ దిగుమతులు నిలిచిపోయాయి. ఇటు వంట నూనెల నుంచి వంటింట్లో వాడే పప్పుదినుసుల దిగుమతులు నిలిచిపోనున్నాయి. నిత్యావసర ధరలు పెరిగి సామాన్య, మధ్యతరగతి ప్రజలపై పెనుభారం పడనుంది. మరోవైపు పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ యుద్ధంతో డ్రైఫ్రూట్స్ దిగుమతులు నిలిచిపోయాయి. ఇప్పటికే కొన్ని డ్రైఫ్రూట్స్ ధరలు పెరిగాయి. యుద్ధం ఇదేవిధంగా కొనసాగితే వీటి ధరలు మరింత పెరిగే చాన్స్ ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande