ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఇంటి పనుల పురోగతిని పరిశీలించిన కలెక్టర్,
కామారెడ్డి, 05 మార్చి (హి.స.) కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండలం గొల్లపల్లి గ్రామాన్ని గురువారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల
Kamareddy collector


కామారెడ్డి, 05 మార్చి (హి.స.) కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండలం గొల్లపల్లి గ్రామాన్ని గురువారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులు నిర్మించుకుంటున్న ఇంటి పనుల పురోగతిని పరిశీలించి, నిర్మాణం పనులు నాణ్యతగా, త్వరితగతిన పూర్తి చేయాలని, ఉగాది లోగా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారులకు అందుతున్న సౌకర్యాల పై ఆరా తీశారు. అనంతరం మండల ప్రాథమిక పాఠశాలను సందర్శించి వంటగదిని పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందిస్తున్న తీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులకు రాగి జావ అందిస్తున్నారా అని ఆరా తీశారు. విద్యార్థులకు పోషకాహారం అందేలా ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande