మహిళలకు ఉచితంగా హెల్త్ చెకప్ లు.. మంత్రి దామోదర..
హైదరాబాద్, 05 మార్చి (హి.స.) తెలంగాణ రాష్ట్రంలోని మహిళా శక్తికి ఆరోగ్య భరోసా కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో రూపొందించిన ''హెల్త్ మిషన్-100'' (
మంత్రి దామోదర


హైదరాబాద్, 05 మార్చి (హి.స.)

తెలంగాణ రాష్ట్రంలోని మహిళా శక్తికి

ఆరోగ్య భరోసా కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో రూపొందించిన 'హెల్త్ మిషన్-100' (100 రోజుల ఆరోగ్య మిషన్) కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఒక భారీ వైద్య విప్లవానికి నాంది పలికారు. మార్చి 8 నుండి ఈ బృహత్తర మిషన్లో ప్రధానంగా మహిళలు, పిల్లలు మరియు వృద్ధుల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ మహిళల దినోత్సవం (మార్చి 8) నాడు ప్రత్యేకంగా మహిళలకు హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలను ప్రారంభించబోతున్నారు. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేద మహిళల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఎటువంటి ఖర్చు లేకుండా అత్యాధునిక డయాగ్నస్టిక్ సేవలను వారి ముంగిటకే చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కాగా ఈ హెల్త్ చెకప్స్ ను రానున్న 6 నెలల పాటు కొనసాగించనున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు..

ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల (SHG/DWCRA) సభ్యులే కేంద్రంగా సాగనుంది. సెర్ప్ (SERP) గణాంకాల ప్రకారం సుమారు 42 లక్షల నుండి 46 లక్షల మంది మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. ప్రతి మహిళకు టీ డయాగ్నస్టిక్స్(Telangana Diagnostics) నెట్వర్క్ ద్వారా దాదాపు 30 రకాల కీలకమైన వైద్య పరీక్షలను ప్రభుత్వం ఉచితంగా నిర్వహించనుంది. కేవలం సాధారణ పరీక్షలకే పరిమితం కాకుండా, మహిళల్లో ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధిని ముందస్తుగా గుర్తించేందుకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను కూడా ఇందులో అంతర్భాగం చేశారు. ఈ మొత్తం స్క్రీనింగ్ ప్రక్రియను నాలుగు దశల్లో (Phases) విభజించి, రాబోయే ఆరు నెలల కాలంలో పూర్తిస్థాయిలో మంత్రి దామోదర రాజనర్సింహ ముగించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

మరోవైపు ఈ మిషన్ కేవలం పరీక్షలకే పరిమితం కాకుండా ప్రతి మహిళకు ఒక 'డిజిటల్ హెల్త్ ప్రొఫైల్'ను తయారు చేయనుంది. దీనివల్ల భవిష్యత్తులో వారికి ఏదైనా అనారోగ్యం సంభవిస్తే వారి పూర్తి వైద్య చరిత్ర (Medical History) ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది, తద్వారా మెరుగైన చికిత్స అందించడం సులభతరమవుతుంది. వేసవి కాలం రానున్న నేపథ్యంలో వడదెబ్బ, డయేరియా వంటి ఇతర సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ఈ 100 రోజుల మిషన్లో చేర్చారు. పాలీ క్లినిక్ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలతో 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత పకడ్బందీగా అమలు చేస్తోంది. ఈ ఆరోగ్య ఉద్యమం ద్వారా తెలంగాణలోని మహిళా లోకానికి ఒక బలమైన ఆరోగ్య రక్షణ కవచాన్ని నిర్మిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande