ఆడంబరాలకు పోయి అప్పులపాలు కావొద్దు: మంత్రి జూపల్లి
నాగర్ కర్నూల్, 05 మార్చి (హి.స.) ఆడంబరాలకు పోయి అప్పు చేయొద్దని, ఉన్నంత లో గూడు నిర్మించుకొని కుటుంబ భవిష్యత్తును కాపాడుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండల పరిధిలోని ఎన
మంత్రి జూపల్లి


నాగర్ కర్నూల్, 05 మార్చి (హి.స.)

ఆడంబరాలకు పోయి అప్పు చేయొద్దని, ఉన్నంత లో గూడు నిర్మించుకొని కుటుంబ భవిష్యత్తును కాపాడుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండల పరిధిలోని ఎన్మన్ బెట్ల గ్రామంలో గురువారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా భూమి పూజ చేశారు. కొల్లాపూర్ మండలం ఎన్మనబెట్ల గ్రామంలో పేద ప్రజల సొంతింటి కలను నిజం చేసే చారిత్రాత్మక అడుగుగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా భూమి పూజ చేయడం ద్వారా ప్రభుత్వం పేదల పట్ల ఉన్న నిబద్ధతను మరోసారి చాటిచెప్పారు. ఆడంబరాల కోసం అప్పులు చేయొద్దు. ఉన్నంతలో గూడు నిర్మించుకుని కుటుంబ భవిష్యత్తు ను కాపాడుకోవాలని మంత్రి జూపల్లి లబ్దిదారులకు మార్గదర్శక సూచనలు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande