నో హెల్మెట్ – నో ఎంట్రీ.. సూర్యాపేట కలెక్టర్ వినూత్న నిర్ణయం
సూర్యాపేట, 05 మార్చి (హి.స.) సూర్యాపేట జిల్లా కలెక్టర్ హెల్మెట్ పైఅవగాహన పెరిగేలా వినూత్న ఆలోచన చేశారు. జిల్లా కేంద్రం లోని కలెక్టరేట్లోకి ప్రవేశించే ప్రతీ ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ తప్పక ధరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ ఆదేశాలు జా
సూర్యాపేట కలెక్టర్


సూర్యాపేట, 05 మార్చి (హి.స.)

సూర్యాపేట జిల్లా కలెక్టర్ హెల్మెట్ పైఅవగాహన పెరిగేలా వినూత్న ఆలోచన చేశారు. జిల్లా కేంద్రం లోని కలెక్టరేట్లోకి ప్రవేశించే ప్రతీ ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ తప్పక ధరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో సిబ్బంది హెల్మెట్ ధరించని వాహనదారులను కలెక్టరేట్లోకి అనుమతించడం లేదు. బయట ద్విచక్ర వాహనం నిలిపి లోపలికి వెళ్ళాలని, ప్రతి వాహనదారుడు కచ్చితంగా హెల్మెట్ ధరించి లోపలికి వెళ్లాలని సిబ్బంది పేర్కొంటున్నారు. హెల్మెట్ అనేది ఒక రక్షణ పరికరమని, ఇది తలను గాయాల నుండి రక్షించడానికి ఉపయోగించబడుతుందని, హెల్మెట్ ప్రాణ రక్షణకు సహాయపడుతుందని హెల్మెట్ ఉంటేనే కలెక్టరేట్లోకి అనుమతిస్తారని కలెక్టర్ అవగాహన కల్పించడంతో శభాష్ కలెక్టర్ అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. బుధవారం వాహనదారులు కలెక్టరేట్ బయటనే వాహనాలు నిలిపి లోపలికి వెళ్తున్నారు. ఇంకొంతమంది వాహన దారులు వెనుతిరిగి హెల్మెట్ కొనుక్కొని ధరించి లోపలికి వెళ్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande