వేట్లపాలెం బ్లాస్ట్.. 26కు చేరుకున్న మృతులు
ఈ రోజు మరో వ్యక్తి మృతి
కాకినాడ


కాకినాడ, 05 మార్చి (హి.స.)

: కాకినాడ జిల్లా(Kakinada) వేట్లపాలెం(Vetlapaleam) బాణా సంచా(Fireworks) తయారీ కేంద్రంలో జరిగిన పేలుళ్లలో మరో మరణం నమోదు అయింది. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ మరో కార్మికుడు మృతి చెందారు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 26కు చేరుకుంది. ఘటన జరిగిన రోజు స్పాట్లో 21 మంది చనిపోగా క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆస్పత్రులకు తరలించారు. మెరుగైన వైద్యం అందించినప్పటికీ పలువురి పరిస్థితి విషమించి మృతి చెందారు. బుధవారం ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు.

తాజాగా ఈ రోజు మరో వ్యక్తి మృతి చెందారు. మరో ముగ్గురు క్షతగాత్రులు సైతం కాకినాడ జీజీహెచ్లో చికిత్స అందిస్తున్నారు. అయితే మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యుర్తో క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోంది. అయితే ఈ ప్రమాదం నుంచి ఇద్దరు కార్మికులు మాత్రమే స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మరోవైపు ప్రమాదం పై విచారణకు ఉన్నత స్ధాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande