
అమరావతి 05 మార్చి (హి.స.)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల 13వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. అమరావతి సచివాలయంలోని మొదటి బ్లాక్లో ఉదయం 10:30 గంటలకు ఈ భేటీ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పరిపాలనా పరమైన కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం అందుతుంది.
కేబినెట్ సమావేశం నేపథ్యంలో, చర్చకు తీసుకురావాల్సిన అంశాలకు సంబంధించిన ప్రతిపాదనలను ఈ నెల 11వ తేదీ సాయంత్రం 4 గంటలకల్లా పంపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఈ ప్రతిపాదనలను సాధారణ పరిపాలన శాఖలోని కేబినెట్ విభాగానికి చేరవేయాలని స్పష్టం చేశారు. గడువులోగా అన్ని వివరాలను సిద్ధం చేయాలని సీఎస్ నుంచి శాఖాధిపతులకు స్పష్టమైన ఆదేశాలు అందినట్లు సమాచారం అందుతుంది. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల తర్వాత జరుగుతున్న మొదటి కేబినెట్ సమావేశం కావడంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV