రఘురామ టార్చర్ కేసు.. విచారణకు హాజరైన ఐపీఎస్ సునీల్ నాయక్
అమరావతి, 05 మార్చి (హి.స.) వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఏంపీగా ఉన్న సమయంలో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం గా మారిన విషయం తెలిసిందే. కాగా ఈ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ ప్రార
raghurama-torture-case-ips-sunil-nayak-attended-the-hearing-


అమరావతి, 05 మార్చి (హి.స.)

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఏంపీగా ఉన్న సమయంలో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం గా మారిన విషయం తెలిసిందే. కాగా ఈ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ ప్రారంభం అయింది. ఈ కేసులో భాగంగా ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ నాయక్ (IPS officer Sunil Kumar Nayak) గురువారం గుంటూరులోని సీసీఎస్ (CCS) పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకే ఆయన విచారణాధికారి ముందు హాజరు కాగా, సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతున్నట్లు సమాచారం.

గత ప్రభుత్వ హయాంలో సీఐడీ డీఐజీ (CID DIG)గా పనిచేసిన సమయంలో రఘురామను చిత్రహింసలకు గురిచేశారనే ఆరోపణలపై పోలీసులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. విచారణకు సహకరించాలని, మార్చి 5లోపు హాజరుకావాలని ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయన నేడు అధికారుల ముందుకు వచ్చారు. గత నెలలో ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం బీహార్లో ఐజీగా పనిచేస్తున్న సునీల్ నాయక్ను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసుల బృందం పాట్నాకు వెళ్లింది.

ఫిబ్రవరి 23న తెల్లవారుజామున ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకున్నప్పటికీ, స్థానిక కోర్టులో ఏపీ పోలీసులకు చుక్కెదురైంది. ట్రాన్సిట్ రిమాండ్ కోసం పోలీసులు చేసిన దరఖాస్తును పాట్నా సివిల్ కోర్టు తిరస్కరించింది. అరెస్ట్ వారెంట్ లేకపోవడం, కేస్ డైరీని సమర్పించక పోవడం వంటి ప్రక్రియాపరమైన లోపాలను (Procedural Lapses) ఎత్తిచూపుతూ కోర్టు సునీల్ నాయక్ను విడుదల చేయాలని ఆదేశించింది. ఏపీ పోలీసుల తీరుపై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. పాట్నా కోర్టులో ఎదురుదెబ్బ తగిలిన అనంతరం సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande