
విజయవాడ: , 05 మార్చి (హి.స.)కులమతాలను రెచ్చగొట్టేలా సభలో మాట్లాడుతున్న అచ్చెన్నాయుడిని మంత్రి పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్పీలు డిమాండ్ చేశారు. అన్ని మతాలను గౌరవించాలని రాజ్యాంగం చెబుతుంటే, అచ్చెన్నాయుడు మాత్రం కులమతలాను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ మండిపడ్డారు. ఈరోజు(గురువారం, మార్చి 5వ తేదీ) శాసనమండలి సమావేశాల్లో భాగంగా మీడియా పాయింట్ వద్ద వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు మాట్లాడారు.
ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ మాట్లాడుతూ.. ‘ అచ్చెన్నాయుడితో మాట్లాడిస్తున్నది చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్. రేపు వ్యవసాయం పై జరగాల్సిన చర్చను డైవర్ట్ చేయడం కోసమే ఇలా చేస్తున్నారు. అచ్చెన్నాయుడిని మంత్రి పదవి నుంచి తొలగించాలి. బీఆర్ నాయుడిని తొలగిస్తారా లేదా?’ అని ప్రశ్నించారు.
---------------
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు