తిరుమల వెళ్లే భక్తులకు తీపికబురు.. కేవలం 2 గంటల్లోనే శ్రీవారి దర్శనం
తిరుమల, 05 మార్చి (హి.స.) ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ ప్రస్తుతం సాధారణంగా కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో టోకెన్లు లేని భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి సుమా
తిరుమల


తిరుమల, 05 మార్చి (హి.స.)

ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ ప్రస్తుతం సాధారణంగా కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో టోకెన్లు లేని భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టోకెన్లు ముందుగా పొందిన భక్తులకు 3 నుంచి 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు శ్రీవారి దర్శనం 2 నుంచి 3 గంటల్లోపే అవుతోంది. బుధవారం స్వామివారిని 63,772 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,013 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నిన్న స్వామివారి హుండీకి రూ.1.47 కోట్ల ఆదాయం వచ్చినట్లుగా టీటీడీ అధికారులు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande