
అమరావతి, 05 మార్చి (హి.స.)
ఏపీ అసెంబ్లీ(Ap Assembly) ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. న్యాయం కోసం వచ్చిన తల్లిదండ్రుల(Parents)ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని తుళ్లూరు పోలీస్ స్టేషన్(Tulluru Police Station)కు తరలించారు. దీంతో తల్లిదండ్రుల వెంట వచ్చిన చిన్నారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తల్లిదండ్రులను పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించడంతో ప్లీజ్ వదిలేయమని ప్రాధేయపడ్డారు. చంటి పిల్లలయితే భయబ్రాంతులకు గురయ్యారు.
ప్రకాశ జిల్లా శింగరాయకొండ మండలంలోని శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్లో తౌషిక్ అనే విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే న్యాయం జరగలేదనే కారణంతో తౌషిక్ తల్లిదండ్రులు, వారి బంధువులు ఏపీ అసెంబ్లీ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. తమ కుమారుడిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు నిమిషాల ముందు నవ్వుతూ మాట్లాడిన తమ అబ్బాయిని చంపేశారంటున్నా తల్లిదండ్రులు ఆరోపించారు. స్కూలు యజమాన్యం, విద్యాశాఖ, పోలీసు యంత్రాంగం కుమ్మక్కై కేసును నీరుగారుస్తున్నారంటూ వాపోయారు. శ్రీచైతన్య నవోదయ స్కూల్ గుర్తింపుని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
అయితే అసెంబ్లీ ఎదుట ఆందోళనకు అనుమతి లేని కారణంగా పోలీసులు తౌషిక్ తల్లిదండ్రులను అరెస్ట్ చేసి తుళ్లూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే ఘటనను చూసిన స్థానికులు ఆ తల్లిదండ్రులకు న్యాయం చేయాలని కోరారు. కొడుకు మృతి చెంది పుట్టేటు దు:ఖంలో ఆ తల్లిదండ్రులను ఓదార్చి.. సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. వారి పట్ల పోలీసులు సానుభూతి చూపించాలని కోరారు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV