
అమరావతి, 06 మార్చి (హి.స.) :ప్రత్యేక ఆర్థిక మండళ్లకు భూ సేకరణలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారంపై ఏపీ అసెంబ్లీలో చర్చించారు. ఈ విషయంపై ఎమ్మెల్యేలు సుందరపు విజయ్ కుమార్, యనమల దివ్య ప్రశ్నించారు. గత పదిహేను సంవత్సరాలుగా పరిహారం ఇవ్వకపోవడంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యేలు చెప్పారు. రైతులు చాలామంది చనిపోయారని, వారి వారసులు పరిహారం కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. స్థానికంగా తాము రైతులకు సమాధానం చెప్పుకోలేకపోతున్నామని తెలిపారు. అన్ని ప్రాంతాలకు ఒకే పాలసీ పెట్టి అమలు
ఈ విషయంపై ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సమాధానం ఇచ్చారు. అచ్యుతాపురం సెజ్కు ఐదువేల ఎకరాలు సేకరించారని ప్రస్తావించారు. అప్పటి భూమి ధర ప్రకారం కాకుండా ఇప్పటి ధర ప్రకారం రైతన్నలు పరిహారం అడుగుతున్నారని తెలిపారు. ఈ విషయంపై అన్నదాతలతో అధికారులు మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. స్థానిక ఎమ్మెల్యేలు ఈ విషయంలో సంప్రదింపులు చేయాలని కోరారు. కాకినాడ సెజ్ కోసం 4 వేల ఎగరాలను రైతన్నల నుంచి తీసుకున్నారని ప్రస్తావించారు. అక్కడ కూడా కొందరు రైతులకు పరిహారం అందలేదన్నారు. వారి సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని మంత్రి టీజీ భరత్ పేర్కొ్న్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ