నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ పెచ్చెరువు సమీపంలో అగ్నిప్రమాదం
నంద్యాల, 06 మార్చి (హి.స.)నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని పెచ్చెరువు సమీపంలో ఇవాళ(శుక్రవారం) అగ్నిప్రమాదం జరిగింది. అడవిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అటవీ సంపద కళ్లముందే కాలిపోయింది. వేసవి కాలం కావడంతో ఎండిన ఆకులు, చెట్లు ఉండటంత
నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ పెచ్చెరువు సమీపంలో అగ్నిప్రమాదం


నంద్యాల, 06 మార్చి (హి.స.)నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని పెచ్చెరువు సమీపంలో ఇవాళ(శుక్రవారం) అగ్నిప్రమాదం జరిగింది. అడవిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అటవీ సంపద కళ్లముందే కాలిపోయింది. వేసవి కాలం కావడంతో ఎండిన ఆకులు, చెట్లు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో విలువైన వృక్షసంపదకు ముప్పు వాటిళ్లింది.

అడవిలో చెలరేగిన కార్చిచ్చును అదుపు చేసేందుకు వెళ్లిన ప్రొటెక్షన్ వాచర్లకు చేదు అనుభవం ఎదురైంది. మంటల తీవ్రతకు వారు అక్కడ నిలిపి ఉంచిన మూడు మోటార్ బైక్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. అదృష్టవశాత్తూ సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. అయితే, ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పి, అటవీ ప్రదేశాన్ని రక్షించేందుకు కృషి చేస్తున్నారు. అధికారులు చేపట్టిన చర్యల ద్వారా మంటలు కొంత నియంత్రణలోకి వచ్చాయని సమాచారం. అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలు, పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. ప్రకృతి ప్రసాదించిన అటవీ సంపదను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని తెలిపారు. ఈ ప్రమాదంపై అటవీ శాఖ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande