నందిగామ ఎమ్మెల్యే ప్రభుత్వ.విప్ తంగిరాల సౌమ్య లా పరీక్షలు రాస్తున్నారు
నందిగామ, 06 మార్చి (హి.స.) , ఎస్వీఎన్ కాలనీ, నందిగామ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య లా పరీక్షలు రాస్తున్నారు. గుంటూరులోని జేసీ లా కళాశాలలో గురువారం ఎల్ఎల్బీ మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యారు. గత విద్యాసంవత్సరంలో ఆమె ప్రవేశపరీక్ష రాసి కళ
నందిగామ ఎమ్మెల్యే ప్రభుత్వ.విప్ తంగిరాల సౌమ్య లా పరీక్షలు రాస్తున్నారు


నందిగామ, 06 మార్చి (హి.స.)

, ఎస్వీఎన్ కాలనీ, నందిగామ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య లా పరీక్షలు రాస్తున్నారు. గుంటూరులోని జేసీ లా కళాశాలలో గురువారం ఎల్ఎల్బీ మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యారు. గత విద్యాసంవత్సరంలో ఆమె ప్రవేశపరీక్ష రాసి కళాశాలలో సీటు సాధించారు. మూడేళ్ల లా కోర్సులో భాగంగా మొదటి ఏడాది పరీక్షలకు హాజరవుతున్నారు. ఆమె తండ్రి మాజీ ఎమ్మెల్యే దివంగత తంగిరాల ప్రభాకరరావు న్యాయవాదిగా సేవలందించి మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని సౌమ్య చదువుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande