విశాఖ జంతు ప్రదర్శన శాలకు కొత్త నేస్తాలు
విశాఖ 06 మార్చి (హి.స.) ఇందిరాగాంధీ జంతు ప్రదర్శన శాలకు గురువారం ఉదయం కొత్త నేస్తాలు వచ్చాయి. జంతు మార్పిడి విధానంలో భాగంగా హిమాలియన్ బ్లాక్ బేర్, బ్లాక్ పాంథర్, కామన్ చిరుతపులి, ఆసియాటిక్ సింహం, ఏసియన్ పామ్ సివెట్ జాతులను అసోంలోని జూ పార్కు నుంచి
విశాఖ జంతు ప్రదర్శన శాలకు కొత్త నేస్తాలు


విశాఖ 06 మార్చి (హి.స.) ఇందిరాగాంధీ జంతు ప్రదర్శన శాలకు గురువారం ఉదయం కొత్త నేస్తాలు వచ్చాయి. జంతు మార్పిడి విధానంలో భాగంగా హిమాలియన్ బ్లాక్ బేర్, బ్లాక్ పాంథర్, కామన్ చిరుతపులి, ఆసియాటిక్ సింహం, ఏసియన్ పామ్ సివెట్ జాతులను అసోంలోని జూ పార్కు నుంచి విశాఖ జూకు తీసుకువచ్చినట్లు క్యూరేటర్ మంగమ్మ తెలిపారు. వాటికి బదులుగా ఇక్కడి నుంచి రింగ్ టెయిల్డ్ లీమూర్, స్టంప్ టెయిల్డ్ మకాక్, జంగిల్ క్యాట్, గ్రీన్ ఇగ్వానా, హైనాలను పంపుతున్నట్లు ఆమె తెలిపారు. వెటర్నరీ అధికారుల నేతృత్వంలో అక్కడి సిబ్బంది వాటిని సురక్షితంగా తీసుకువచ్చారన్నారు. వీటిని క్వారంటైన్లో ఉంచి, వ్యవధి ముగిశాక సంబంధిత ఎన్క్లోజర్ లలోకి విడుదల చేస్తామన్నారు. ఈ కొత్త నేస్తాలు సందర్శకులకు విశేషంగా అలరిస్తాయని ఆమె పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande