రంపచోడవరం మన్యంలోనే పెద్దపులి.సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు
గంగవరం,, 06 మార్చి (హి.స.) : రంపచోడవరం మన్యంలోనే పెద్ద పులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గంగవరం, అడ్డతీగల మండలాల పరిధిలో అది ఉన్నట్లు తెలుస్తోంది. గంగవరం మండలం మొల్లవరం, అడ్డతీగల మండలం తిమ్మాపురం పరిసరాల్లో రాత్రి పెద్దపులి సంచరించినట
రంపచోడవరం మన్యంలోనే పెద్దపులి.సంచరిస్తున్నట్లు  అధికారులు గుర్తించారు


గంగవరం,, 06 మార్చి (హి.స.)

: రంపచోడవరం మన్యంలోనే పెద్ద పులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గంగవరం, అడ్డతీగల మండలాల పరిధిలో అది ఉన్నట్లు తెలుస్తోంది. గంగవరం మండలం మొల్లవరం, అడ్డతీగల మండలం తిమ్మాపురం పరిసరాల్లో రాత్రి పెద్దపులి సంచరించినట్లు స్థానికులు చెబుతున్నారు. పెద్దపులి పాదముద్రలు సేకరించే పనిలో అటవీ బృందాలు ఉన్నాయి. గంగవరం, అడ్డతీగల, గోకవరం, జగ్గంపేట, ఏలేశ్వరం మండలాల పరిధిలో జనం అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ విజ్ఞప్తి చేసింది. పులి మెడలోని రేడియో కాలర్ ద్వారా ఎక్కడ ఉందనేది అధికారులు తెలుసుకుంటున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande