వేటపాలెం పేలుడు . .దుర్ఘటనలో.ఇద్దరు.అరెస్ట్
కాకినాడ/సామర్లకోట,, 06 మార్చి (హి.స.)కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన పేలుడు దుర్ఘటన కేసులో నిందితులు అడబాల అర్జున్(ఏ-1), అడబాల వీరబాబు(ఏ-2)లను పోలీసులు అరెస్టు చేశారు. ఆ ఘటనలో తీవ్రంగా గాయపడి కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న
వేటపాలెం పేలుడు   .   .దుర్ఘటనలో.ఇద్దరు.అరెస్ట్


కాకినాడ/సామర్లకోట,, 06 మార్చి (హి.స.)కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన పేలుడు దుర్ఘటన కేసులో నిందితులు అడబాల అర్జున్(ఏ-1), అడబాల వీరబాబు(ఏ-2)లను పోలీసులు అరెస్టు చేశారు. ఆ ఘటనలో తీవ్రంగా గాయపడి కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు మరణించారు. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ గురువారం సాయంత్రం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అడబాల అర్జున్, వీరబాబు(నాని) మధ్యాహ్నం 2 గంటల సమయంలో సామర్లకోట రైల్వే గూడ్స్ షెడ్ వద్ద రైలు ఎక్కడానికి వేచి ఉండగా పెద్దాపురం ఇన్చార్జి డీఎస్పీ కేవీవీ సత్యనారాయణ అరెస్టు చేసినట్లు వెల్లడించారు. గత నెల 28వ తేదీ మధ్యాహ్నం వేట్లపాలెంలో జరిగిన ఈ పేలుడు ప్రమాదంపై అదేరోజు సాయంత్రం తహశీల్దార్ కె.చంద్రశేఖర్రెడ్డి ఫిర్యాదు చేశారని, ఆ మేరకు సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ యాజమాని అడబాల అర్జున్, ఆయన సోదరుడు అడబాల వీరబాబు, వారి తండ్రి అడబాల శ్రీనివాసరావు (దుర్ఘటనలో మృతి చెందారు)పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని చెప్పారు.

అర్జున్ తన ఫైర్వర్క్స్కు 2022లో ఎల్ఈ-1 లైసెన్స్ పొందారని, తిరిగి 2024లో రెన్యువల్ చేయించినట్లు తమ విచారణలో తేలిందని ఎస్పీ తెలిపారు. వీరబాబుకు బాణసంచా విక్రయానికి సంబంధించి ఎల్ఈ-5 లైసెన్స్ ఉందని.. వారిద్దరి తండ్రికి వేట్లపాలెంలో వివిధ తయారీ యూనిట్లలో పనిచేసిన అనుభవం ఉండడంతో అర్జున్ పేరిట లైసెన్స్ తీసుకుని ముగ్గురూ కలిసి కొన్నేళ్లుగా వ్యాపారం నిర్వహిస్తున్నారని చెప్పారు. ‘అర్జున్ లైసెన్స్ గడువు ఈ నెల 30న ముగియనుండడంతో ఈలోపు అధిక మొత్తంలో బాణసంచా తయారు చేసి వీరబాబు దుకాణంలో విక్రయించే ఉద్దేశంతో పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ జువ్వగుల్లలు, ప్లాస్టిక్ చిచ్చుబుడ్ల గుల్లల్లో మందుగుండు పదార్థాన్ని అధికంగా నింపే పని చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande