
అమరావతి, 06 మార్చి (హి.స.) :‘రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వానికి కేంద్రం అన్నివిధాలా అండగా ఉంటోంది. జగన్ పాలనలో నాశనమైన ఆంధ్రప్రదేశ్ను గాడిన పెట్టేందుకు డబులింజన్ సర్కార్ కృషి చేస్తోంది’ అని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్ అన్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రమేశ్ నాయుడు, గోపీ శ్రీనివాస్, యామినీ శర్మతో కలసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘హిందూ ఆలయాలపై దాడులు, మతమార్పిళ్లు, అవినీతి, అరాచక వైసీపీకి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారు. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు’ అని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ